News January 3, 2026
బంగ్లాదేశ్‌లో మరో హిందువు మృతి

బంగ్లాదేశ్‌లో ఇటీవల <<18733577>>మూకదాడి<<>>లో తీవ్రంగా గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకన్ దాస్ మృతిచెందారు. డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో ఆయనపై ఓ గుంపు కత్తులతో దాడి చేసి నిప్పు అంటించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన చెరువులోకి దూకినా తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటికే అమృత్ మండల్, దీపూ దాస్ వంటి హిందువులు ఈ తరహా దాడుల్లో బలైన విషయం తెలిసిందే.
Similar News
News February 26, 2026
రాష్ట్రానికి రూ.2,160 కోట్లు?

TG: PMAY-అర్బన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 1.3 లక్షల యూనిట్లు మంజూరవడంతో ₹1,695 కోట్లు అందనున్నాయి. అలాగే PMAY-గ్రామీణ్ పథకం కింద 3 లక్షల యూనిట్లు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరో ₹2,160 కోట్లు అందనున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బూస్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News February 26, 2026
మారిన మనుషులు.. స్నేహితులే వద్దంట!

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో ఫ్రెండ్‌షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్‌షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్‌లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?
News February 26, 2026
తప్పెవరిది? శిక్ష ఎవరికి?

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.


