News April 25, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి క్వింటా రూ.17,800 ధర పలకగా.. 341 రకం మిర్చి రూ.14,000 పలికింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14,000 పలికింది. దీపిక మిర్చి రూ.15వేలు, 5531 రకం మిర్చి రూ.11,500 ధర, టమాటా మిర్చికి 24వేల ధర వచ్చింది. పసుపు కాడి క్వింటాకి రూ.14,155, పసుపు గోల రూ.13723, మక్కలు బిల్టీ రూ.2265 ధర పలికాయి.

Similar News

News January 7, 2026

జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

image

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.

News January 6, 2026

ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలించాలి: కలెక్టర్

image

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు నిర్ణీత గడువులోగా తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణాల పరిధిలో జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పార్టీల ప్రతినిధులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులపై స్పందించాలన్నారు.

News January 6, 2026

పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

image

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.