News January 3, 2026
BIG BREAKING: HYDలో పోరాటానికి సిద్ధమైన BRS

GHMC డీలిమిటేషన్ మీద BRS నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్‌తో విభజన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ సాధించేందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. జంట నగరాలను ఇష్టం వచ్చినట్లు విడదీసి, ప్రజల మనోభావాల తోటి ఆడుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు BRS పోరాటం చేస్తుందని తలసాని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
HYD: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. శంకర్‌పల్లి, షాబాద్, ఎంకేపల్లి తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు <
News February 8, 2026
JNTUHలో ‘బంగారు’తల్లి ఈమే!

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ CSE విభాగంలో అల్లంరాజు శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. యూనివర్సిటీ నుంచి 4 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో సైతం ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సైతం సాధించింది. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, వారి కలలు సాకారం చేశానని తెలిపింది.
News February 8, 2026
హలీమ్ HYD ఎలా వచ్చిందంటే?

రంజాన్ మహినా షురూ అయిందంటే HYD షెహర్‌లో హలీం పరిమళాలు, దాని రుచితో మత్తెక్కిపోతుంది. పట్నంలో పొద్దుపోయినాక బట్టీల వద్ద హలీం లవర్స్ సందడి కనిపిస్తుంది. అయితే హలీమ్ అరబ్బుల వంటకం. నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన పర్షియన్ల ద్వారా HYDకు పరిచయమైంది. 90 ఏళ్ల క్రితం పత్తర్‌గట్టిలోని మదీనా హోటల్ దీని రుచిని పట్నానికి పరిచయం చేసింది. ప్రజలు మెచ్చిన వంటకంగా 2010లో GI గుర్తింపు పొందింది.


