News January 3, 2026

గద్వాల: ఆన్‌లైన్‌లో మున్సిపల్ ఓటర్ల జాబితా

image

గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల ఓటర్లు తమ వార్డు వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చని కలెక్టర్ సంతోష్ శనివారం తెలిపారు. ఓటర్లు https://urban2025.tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఓటు ఏ మున్సిపాలిటీ, ఏ వార్డుకు మ్యాప్ అయిందో సులభంగా చూసుకోవచ్చని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా సమాచారాన్ని తక్షణమే పొందేందుకు ఈ వెబ్ పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు.

Similar News

News January 13, 2026

కోదాడ: 3 ముక్కలుగా విరిగిన కోడి తొడ.. ఎముకకు పిన్నింగ్‌తో జాయింట్

image

కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య మూగ జీవాలకు వినూత్న చికిత్సలు చేసి వాటికి ప్రాణం పోస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ముక్కలుగా విరిగిన కోడి తొడ ఎముకలకు పిన్నింగ్ ద్వారా అతికించి కోడి తిరిగి యధావిధిగా నడిచే విధంగా చికిత్స అందించారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస రావు.. డాక్టర్ పెంటయ్య వినూత్న చికిత్సా విధానాన్ని అభినందించారు.

News January 13, 2026

సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

image

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.

News January 13, 2026

GWL: ఈనెల 27 నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

image

గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడ్ వద్ద కొలువై ఉన్న జమ్ములమ్మ, పరశురామస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ఉ.11 గంటలకు అమ్మవారిని ఆహ్వానించేందుకు గుర్రంగడ్డ గ్రామానికి బండి వెళ్లనుంది. 28న ఉదయం 6 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) పౌర్ణమి నాడు భారీ జాతర, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.