News January 3, 2026
మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.
Similar News
News February 13, 2026
తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.
News February 13, 2026
మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
BREAKING: రామాయంపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

రామాయంపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


