News April 25, 2024
కొడంగల్ బిడ్డకు.. CM, PCC పదవిని ఇచ్చిందే కాంగ్రెస్

ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100రోజుల్లోనే అమలు చేశామని CM రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. KCR మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. CM మాట్లాడుతూ.. కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ CM, PCC పదవిని ఇచ్చిందని అన్నారు.
Similar News
News March 17, 2026
మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.
News March 17, 2026
పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?
News March 17, 2026
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


