News January 3, 2026

మేడ్చల్ జిల్లాలో క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇది..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కీసర మండలం సహా అనేక ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పిచ్చిగడ్డి, మొక్కలతో కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 259 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 145 క్రీడా ప్రాంగణాలను లే అవుట్ పార్కు స్థలాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహణ మరిచింది. దీంతో ప్రస్తుతం అవి ఎటూ పనికిరాకుండా పోతున్నాయని ప్రజలంటున్నారు.

Similar News

News January 30, 2026

బైక్ సైలెన్సర్లు మార్చితే సీజ్ చేస్తాం.. ఎస్పీ హెచ్చరిక

image

ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలు చేస్తే బైక్‌లను సీజ్ చేస్తామని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పెద్ద శబ్దాల వల్ల గర్భిణీలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని గురువారం కోరారు.

News January 30, 2026

ఇన్‌స్టాగ్రామ్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్‌లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్‌స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

News January 30, 2026

కామారెడ్డి: రైతులకు 50% రాయితీపై ప్లాస్టిక్ క్రేట్లు

image

కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా రాయితీపై ప్లాస్టిక్ క్రేట్లు అందజేయనున్నట్లు కామారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి Way2Newsతో తెలిపారు. ఒక్కో క్రేట్ ధర రూ.337 కాగా 50% రాయితీపై రైతులకు కేవలం రూ.169 ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల రైతులు ‘DHSO Kamareddy’ పేరుతో DD తీసి, సంబంధిత ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.