News April 25, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

Similar News

News April 22, 2025

తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

image

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News April 22, 2025

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. తండ్రీ కూతుళ్లు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి, కూతురు కలిసి బైక్‌పై వెళ్తుండగా ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనగా తండ్రీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆస్పిరి మండలం ముత్తుకూరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2025

రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!