News January 3, 2026
శాతవాహన వర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొ. సతీష్ కుమార్

శాతవాహన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం అధిపతిగా, పరీక్షల విభాగం కాన్ఫిడెన్షియల్ కంట్రోలర్‌గా ఆయనకు విశేష అనుభవం ఉంది. గతంలో బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గానూ సతీష్ కుమార్ సమర్థవంతంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.
News February 21, 2026
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

చలి తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో మిరప పంటలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


