News January 3, 2026

నల్లగొండలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వాల్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే కారణమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “నో హెల్మెట్ – నో పెట్రోల్” నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News January 26, 2026

నల్గొండ: షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్ల కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానంలో తొలిరోజు మూడు బైకులకు డీలర్ పాయింట్ వద్దే నంబర్లు కేటాయించారు. డీలర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగా, ఆర్టీఓ అధికారులు పర్మినెంట్ నంబర్లు జారీ చేశారు. జిల్లాలో రోజుకు సగటున 100 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, తాజా మార్పుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

News January 25, 2026

NLG: ఈయన జర్నీ ఎందరికో స్ఫూర్తి

image

దళిత కుటుంబంలో జన్మించినా తన తలరాతను తానే రాసుకోవాలనే దృఢ సంకల్పమే పి.చంద్రయ్యను ఉన్నత స్థానానికి చేర్చింది. చదువును ఆయుధంగా మలుచుకొని, అనేక అవరోధాలను అధిగమిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు. శాలిగౌరారం (M) ఇటుకల పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం సాగింది. 31 ఏళ్ల నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే చివరకు ఆయనను ఐఏఎస్ చేసింది.

News January 25, 2026

నల్గొండ: మున్సిపల్ పోరు.. ఇన్‌ఛార్జిలు వీరే..

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ కార్పొరేషన్‌కు MLC కోటిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. అలాగే నందికొండకు యుగేంధర్ రావు, హాలియాకు విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు లింగయ్య యాదవ్, చండూరుకు వెంకటనారాయణ గౌడ్, చిట్యాలకు చాడ కిషన్ రెడ్డిలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను వీరికి అప్పగించింది.