News January 3, 2026

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి: DEO

image

తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకాన్ని పెంచేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని DEO సలీమ్ బాషా సూచించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం DEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుస్తకాల పఠనం, ఉత్తమ మార్కుల్లో విద్యార్థులు ఆకాశమే హద్దుగా నిలిచేలా తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు.

Similar News

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

News February 23, 2026

నేడు గుంటూరు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్‌లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.