News January 3, 2026
నెల్లూరు కలెక్టర్ వినూత్న నిర్ణయం

కొత్త సంవత్సరం వేళ బొకేలు, స్వీట్లకు బదులు విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వాలన్న కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునకు మంచి స్పందన లభించింది. సందర్శకులు ఇచ్చిన వాషింగ్ మెషిన్‌ను కలెక్టర్ శనివారం బీసీ బాలికల హాస్టల్‌కు పంపారు. అలాగే కావలి, ఆత్మకూరు హాస్టళ్లకు నోట్ పుస్తకాలు, డిక్షనరీలను పంపిణీ చేశారు. విద్యార్థులపై కలెక్టర్ చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News February 17, 2026
నెల్లూరులో 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు DMHO 15 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ (స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ), DMLT, BSc MLT, LLB, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు రేపటి వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
News February 17, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

వింజమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన కూరపాటి సురేంద్ర (27) మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెడికల్ షాపులో పనిచేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే సురేంద్ర మరణవార్త విని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం జరగగా, ఏడాది వయసున్న పాప ఉంది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.


