News January 3, 2026

జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన పిట్టల మల్లయ్య కుమార్తె రాజేశ్వరి(17) ఇంటిలో అనుమానాస్పదంగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2026

MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News February 10, 2026

MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. SAVE IT

image

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ థావుర్యనాయక్ తెలిపారు. డ్యూటీ చార్ట్ వేసి ఫోన్ నంబర్‌లను పోలింగ్ సెంటర్ల వద్ద అతికించామని, అంతరాయం ఏర్పడితే..
✒AE టౌన్-1: 87124 72160
✒AE టౌన్-2: 87124 72161
✒AE టౌన్-3: 87124 72162
✒ADE టౌన్: 87124 72156లకు ఫోన్ చేయాలన్నారు.