News January 3, 2026

డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సాయం అందించాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడకల గదుల నిర్మాణం పై MHBD కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు.

Similar News

News February 19, 2026

పార్వతీపురం: ‘నెలాఖరు నాటికి వెరిఫికేషన్ పూర్తి చేయాలి’

image

జిల్లా స్థాయిలో బంగారు కుటుంబాల గుర్తింపు, పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని సచివాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గురువారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తత వెరిఫికేషన్‌పై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెరిఫికేషన్‌లో ఆలస్యం చేసిన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 19, 2026

అల్లూరి జిల్లాను మోడల్ జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

image

అల్లూరి జిల్లాను రాష్ట్రంలోనే ఒక మేటి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన నీతి అయోగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజసిద్ధ అందాలను ప్రపంచానికి పరిచయం చేసి, అరకు, లంబసింగి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు

News February 19, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: రాఘవేంద్రరావు స్థానంలో భరద్వాజ

image

TG: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు సినిమాటోగ్రఫీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.