News January 3, 2026
KCR ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా: రేవంత్

TG: కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎవరైనా తప్పుదోవ పట్టించారా?’ అని ప్రశ్నించారు. ఇక కర్ణాటక నుంచీ జలవివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉన్నప్పటికీ కర్ణాటకపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 9, 2026
GOOD TO SEE: ఏపీలోనూ ఇలాంటి దృశ్యాలు కనపడాలి

రాజకీయ నాయకుల తిట్ల దండకాలతో విసుగెత్తిన ప్రజలకు నిన్నటి ఓ దృశ్యం ఊరటనిచ్చింది. ఈగోలను పక్కనపెట్టి <<18800036>>మంత్రులు<<>> సీతక్క, సురేఖ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. ఆయన కూడా అంతే ఆప్యాయంగా వారికి చీరలు బహూకరించారు. రాజకీయాలన్నీ ఎన్నికల వరకే పరిమితమైతే ఇలాంటి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇదే పద్ధతి ఏపీలోనూ కనిపిస్తే ఎంతో బాగుంటుంది కదా! మీరేమంటారు?
News January 9, 2026
‘జన నాయకుడు’ విడుదలకు లైన్ క్లియర్

విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశించింది. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం మూవీ ఈరోజు విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
News January 9, 2026
నిజమైన ప్రేమకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు!

తొలిప్రేమ జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు అంటారు. అది ఈ జంట విషయంలో అక్షర సత్యమైంది. కేరళకు చెందిన జయప్రకాష్, రష్మీలు టీనేజ్‌లో విడిపోయి దశాబ్దాల కాలం వేర్వేరు జీవితాలను గడిపారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత విధి వీరిని మళ్లీ కలిపింది. పాత జ్ఞాపకాల సాక్షిగా పిల్లల అంగీకారంతో 60 ఏళ్ల వయసులో వీరిద్దరూ ఒక్కటయ్యారు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందంటూ ఈ జంటను నెటిజన్లు కొనియాడుతున్నారు.


