News January 3, 2026

జూలూరుపాడు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు..!

image

జూలూరుపాడు రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. పాపకొల్లులోని సదరు అధికారి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ ఉంచినట్లు తేలడంతో డీఎఫ్ఓ కిష్టగౌడ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ ప్రసాదరావును వివరణ కోరగా సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు ధ్రువీకరించారు.

Similar News

News January 7, 2026

జగిత్యాల: రేపు ఎఫ్‌పీఓలకు శిక్షణ

image

ఆహార ఉత్పత్తి సంస్థలుగా ఎంపికైన జగిత్యాల జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారికి గురవారం ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు హైదరాబాద్ కో ఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించబడునన్నారు. ప్రతి సంఘం నుంచి కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్, ఐదుగురు సభ్యులు హాజరు కావాలన్నారు.

News January 7, 2026

ADB: ఈనెల 9న లూయి బ్రేయిల్ జయంతి వేడుకలు

image

అంధుల పాలిట వెలుగులు నింపిన లూయి బ్రేయిల్ 217వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9న ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్క ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అంధ ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని, అంధుల సమస్యలపై అవగాహన కల్పించేలా కార్యక్రమం సాగుతుందని పేర్కొన్నారు.

News January 7, 2026

జగిత్యాల: ‘బాలికల విద్యా ప్రగతికి బాటలు వేయాలి’

image

బాలికల విద్య ప్రగతికి బాటలు వేయాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారులకు, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కేర్ టేకర్లు కం వార్డెన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలిక విద్య ఆవశ్యకతను వారి ఆరోగ్య ప్రాముఖ్యతను, కేజీబీవీ బడ్జెట్ సద్వినియోగం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై వివరించారు. డీఈఓ రాము తదితరులున్నారు.