News January 3, 2026
హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
Similar News
News January 14, 2026
ఖమ్మం: విభేదాలు వీడి.. ఎర్రజెండాలు ఏకమయ్యేనా?

కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆయా పార్టీల ప్రభావం తగ్గుతోందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. CPI, CPM, CPI ML, CPI ML న్యూడెమోక్రసీ, తదితర కమ్యూనిస్టు పార్టీల మధ్య విభేదాలు బలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే CPI శతాబ్ది ఉత్సవాల వేదికగానైనా కమ్యూనిస్టు నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
News January 14, 2026
నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.
News January 14, 2026
భూపాలపల్లి: ముంగిట ముగ్గులు.. వీధిలో భోగి మంటలు

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ తొలిరోజైన బుధవారం తెల్లవారుజామునే పల్లెలు, పట్టణాలు భోగి మంటల కాంతులతో మెరిసిపోయాయి. యువత చిందులు వేస్తూ సంబరాలు జరుపుకోగా, మహిళలు తమ ఇంటి ముంగిట తీరొక్క రంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉండేవారు పల్లెలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.


