News April 25, 2024
ప్రభాస్ న్యూలుక్ వైరల్

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ న్యూలుక్‌లో ట్రెండీగా ఉన్నారు. ఫుల్ క్రాఫ్, గడ్డంతో స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’, మారుతి ‘రాజాసాబ్’ సినిమా షూట్స్‌లో పాల్గొంటున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ మూవీలో నటిస్తున్నారు.
Similar News
News March 12, 2026
పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
News March 12, 2026
ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.
News March 12, 2026
పాపం జెన్‌జీలు

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.


