News January 4, 2026

ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

image

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

Similar News

News February 20, 2026

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసు.. UPDATE

image

TG: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను మూడోసారి నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. అందులో లోపాలు ఉన్నాయని, హార్డ్ డిస్క్‌లు, CDలు, పెన్‌డ్రైవ్‌లు జత చేయలేదని పేర్కొంది. కాగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 23 మందిపై కేసు నమోదైంది.

News February 20, 2026

22A నిషేధిత భూములపై మంత్రి కీలక ప్రకటన

image

AP: రాష్ట్రంలో 22A నిషేధిత భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో తెలిపారు. ఆ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించే అధికారం RDOలకు అప్పగిస్తామన్నారు. భూమిని 22Aలో చేర్చాలంటే ఆ పట్టాదారునికి రిజిస్టర్డ్ పోస్టు/eKYC ద్వారా నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. పదేళ్ల కిందట అసైన్డ్ చేసిన ఇంటి స్థలాలకు పూర్తి హక్కులు కల్పించబోతున్నామని చెప్పారు.

News February 20, 2026

AI SUMMIT: రాహుల్ విమర్శ.. థరూర్ ప్రశంస!

image

కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదేనని మరోసారి నిరూపితమైంది. AI సమ్మిట్ లోపాలతో మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేసిందని రాహుల్ మండిపడటం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా సమ్మిట్ బాగా జరిగిందని INC MP థరూర్ పొగిడారు. కొన్ని లోపాలు సహజమన్నారు. గతంలోనూ థరూర్ NDA ప్రభుత్వాన్ని మెచ్చుకోగా పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. ఇటీవలే అవి సమసి ఆయనకు కేరళ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.