News January 4, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం అటవీ అధికారులు
✓భద్రాచలం గోదావరికి కనుల పండుగగా నదీహారతి
✓జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు
✓ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్
✓పినపాక: అక్రమ ఇసుక నిలువలు సీజ్
✓బూర్గంపాడు: 9మంది కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓దమ్మపేట: మందలపల్లి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్
✓దమ్మపేట: మైనర్ బాలిక పై వేధింపులు పోక్సో కేసు నమోదు
Similar News
News February 6, 2026
అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఒకే రోజు ముగ్గురి మృతి

అనకాపల్లి జిల్లాలో గురువారం విషాదం నెలకొంది. ఒక్క రోజే జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మునగపాకకు చెందిన TDP నేత బి.లక్ష్మణరావు (52)ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చనిపోయారు. అదేవిధంగా రాంబిల్లి మండలం దిమిలికి చెందిన అన్నదమ్ములు జనపరెడ్డి తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలంలో లారీ ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 6, 2026
ఢిల్లీ క్యాపిటల్స్‌కు హార్ట్ బ్రేక్

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని నానుడి. DCకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టుకు అన్నిసార్లు పరాభవమే ఎదురైంది. నిన్నటి మ్యాచులో బ్యాటర్లు రాణించినా బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థి విజేతగా నిలిచింది. దీంతో WPL ట్రోఫీ గెలిచేందుకు ఆ జట్టుకు మరో సీజన్ వరకు ఎదురుచూపులే మిగిలాయి. IPLలోనూ ఇంతవరకు DC టైటిల్ గెలవకపోవడం తెలిసిందే.
News February 6, 2026
AA22: నెగటివ్ రోల్‌లో రష్మిక?

పుష్పలో అల్లు అర్జున్‌కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22లో ఆమె నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాల్లో నటిస్తున్నారు.


