News April 25, 2024

IPL: చెన్నై ఓటమి.. లక్నో ఘన విజయం

image

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. స్టొయినిస్(124*) సెంచరీతో అదరగొట్టగా, పూరన్ 34, కేఎల్ రాహుల్ 16, పడిక్కల్ 13, దీపక్ హూడా 17* రన్స్ చేశారు. పతిరణ 2, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ 108*, శివమ్ దూబె 66 పరుగులతో రాణించారు.

Similar News

News January 22, 2026

నాగోబా ఆలయ అభివృద్ధికి రూ.22 కోట్లు: సురేఖ

image

ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ధూప, దీప, నైవేద్యం పథకం కింద నాగోబా ఆలయంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందికి ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

News January 22, 2026

ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.

News January 22, 2026

టెక్ యుగంలో వెండి కీలక లోహం: రాబర్ట్ కియోసాకి

image

వెండికి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రాధాన్యం వస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. వెండి కేవలం డబ్బుగా కాకుండా టెక్నాలజీ యుగంలో “స్ట్రక్చురల్ మెటల్”గా మారిందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో దీని వినియోగం పెరుగుతోందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ప్రస్తుత టెక్ యుగంలో వెండి అంతే కీలకంగా మారిందని తెలిపారు.