News January 4, 2026

9న రాజమండ్రిలో మెగా జాబ్ మేళా

image

రాజమండ్రి మంజీర కన్వెన్షన్స్‌లో జనవరి 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మాజీ MP మార్గాని భరత్ శనివారం ప్రకటించారు. సుమారు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళా ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News January 12, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

image

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News January 12, 2026

తూ.గో: అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు

image

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

News January 12, 2026

తూ.గో: ఇనుపరాడ్‌తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

image

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్‌తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వీరయ్యగౌడ్‌ వెల్లడించారు.