News April 25, 2024
NZB పార్లమెంట్‌లో మంగళవారం 16 నామినేషన్లు దాఖలు

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌లు వేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News January 2, 2026
NZB: ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్(24) ఖలీల్‌వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.
News January 2, 2026
నిజామాబాద్: ఏటీఎం దొంగల ముఠా కోసం వేట

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ముఠాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌లో ఇటీవల రెండు ఏటీఎంలు గ్యాస్ కట్టర్‌తో కాల్చి రూ.36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అది జరిగిన రెండో రోజు మళ్లీ నిజామాబాద్, జక్రాన్‌పల్లిలలో రెండు ఏటీఎంల లూటీకి విఫలయత్నం చేశారు. సీరియస్‌గా తీసుకున్న సీపీ సాయి చైతన్య ఐదు బృందాలతో మహారాష్ట్ర, హర్యానాలో నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.


