News January 4, 2026
శుభ సమయం (4-1-2026) ఆదివారం

➤ తిథి: బహుళ పాడ్యమి మ.2.23 వరకు
➤ నక్షత్రం: పునర్వసు సా.5.34 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.42-10.12 వరకు, తిరిగి ఉ.11.17-మ.12.01 వరకు, తిరిగి మ.1.52-సా.4.03 వరకు
➤ రాహుకాలం: సా.4.30 నుంచి 6 వరకు
➤ యమగండం: మ.12 నుంచి 1.30 వరకు
➤ దుర్ముహూర్తం: సా.4.04 నుంచి 4.47 వరకు
➤ వర్జ్యం: శే.ఉ.7.41 వరకు, తిరిగి రా.1.15-2.48 వరకు
➤ అమృత ఘడియలు: లేవు
Similar News
News February 13, 2026
వైట్ కాలర్ జాబ్స్‌ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
News February 13, 2026
డయాబెటిస్‌తో మతిమరుపు రిస్క్.. ఎలాగంటే?

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవాళ్లలో మతిమరుపు రిస్క్ ఎక్కువని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి ప్రకారం.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బ్రెయిన్ గ్లూకోజ్‌ను వాడుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా న్యూరోలాజికల్ డ్యామేజ్ జరుగుతుంది. నిరంతర హైబీపీ వల్ల ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాస్కులర్ డ్యామేజ్ జరిగి బ్రెయిన్ టిష్యూ దెబ్బతింటుంది. దీంతో దీర్ఘకాలంలో అల్జీమర్స్ రిస్క్ పెరుగుతుంది.
News February 13, 2026
కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్ కరీంనగర్ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.


