News January 4, 2026
SKLM: ‘బీసీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు’

శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు విద్యార్థులకు సరిగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్నారు.
Similar News
News January 30, 2026
శ్రీకాకుళం: సూసైడ్ చేసుకుంటానని ఫొన్..కాపాడిన పోలీసులు

శ్రీకాకుళం(D) పోలాకి(M) చెందిన ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబీకులకు ఫొన్ చేసింది. వారు ఆందోళన చెంది 112 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూం పోలాకి పోలీసులకు విషయం తెలపగా ఎస్సై రంజిత్ సదరు మహిళకు ఫొన్‌లో కాంటాక్టై ఆమదాలవలస పరిసర ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం జీఆర్పీ, లోకల్ పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళను సురక్షితంగా కాపాడారు.
News January 30, 2026
శ్రీకాకుళం: రథసప్తమి దర్శనాల్లో నకిలీ పాసులు..నిజమెంత

శ్రీకాకుళం పట్టణంలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించిన పాసులు నకిలీవి ముద్రించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీఐపీ పాసులు, రూ.500 క్షీరాభిషేక టికెట్లు నకిలీ ముద్రణ జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలలో సోదాలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
News January 30, 2026
ఈనెల 31న శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. సుధ తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌లో ‘రిటైల్ బ్యాంక్ మిత్ర ప్రమోటర్’ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఇతర కంపెనీల వివరాలు, విద్యార్హతల కోసం అభ్యర్థులు www.ncs.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


