News April 25, 2024

KNR: మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్

image

విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.

Similar News

News January 4, 2026

KNR: డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం KNR జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో 200 మంది డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డీటీసీ పి.పురుషోత్తం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వారికి సీపీఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ ప్రణవ్ వివరించారు. శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, జనరల్ చెకప్ నిర్వహించారు.

News January 4, 2026

KNR: మహిళా, మైనారీటీ పథకాలకు ధరఖాస్తుల ఆహ్వానం

image

మైనారీటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2 పథకాలకు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారీటి సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాధలు, అవిహితులు, చిరు వ్యాపారులకు రూ.50 వేలు, ఫఖీర్, దూదేకుల వర్గాలకు మోపడు వాహనాలకు రూ.లక్ష ఇస్తారని చెప్పారు. అర్హులు ఈ నెల 10లోగా ఆన్లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0878-2957085 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.