News April 25, 2024

టీ20 WC జట్టులో ఆ ప్లేయర్ ఉండాల్సిందే..!

image

టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులో ఏయే ప్లేయర్లు ఉండాలనే విషయమై ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ కప్ స్క్వాడ్‌లో రాహుల్‌కు చోటివ్వాలా వద్దా అని ఓ ఛానల్ పోలింగ్ నిర్వహించింది. దీనికి 70శాతం మంది రాహుల్ జట్టులో ఉండాలని ఓటేశారు. మరో 30 శాతం మంది నో అని బదులిచ్చారు. ఇంతకీ మీ కామెంట్ ఏంటి?

Similar News

News October 25, 2025

పార్టీకి నష్టం జరగొద్దనే పోరాట విరమణ: ఆశన్న

image

కేంద్ర బలగాల దాడులతో పార్టీకి నష్టం జరగొద్దనే సాయుధ పోరాటాన్ని విరమించామని మావోయిస్టు ఆశన్న తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి BR దాదా నాయకత్వంలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమాచార లోపంతో కొంతమంది కామ్రేడ్లు దీన్ని తప్పుగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల 200 మంది మావోలతో కలిసి ఆశన్న ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు. అంతకుముందు మల్లోజుల మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు.

News October 25, 2025

విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్‌టైమ్ ఇదే

image

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్‌టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్‌టైన్‌మెంట్ మాస్‌వేవ్‌ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.