News April 25, 2024

వచ్చే ఏడాది భారత్‌కు మరో రెండు S-400లు!

image

రష్యా నుంచి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400లు ఈ ఏడాదే రావాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. ఇప్పటికి 3 చేరుకోగా, మరో రెండింటి డెలివరీపై అధికార వర్గాలు స్పందించాయి. వచ్చే ఏడాది అవి దేశానికి రానున్నాయని వెల్లడించాయి. ఈ డీల్ విలువ 5.5 బిలియన్ డాలర్లు. కాగా రష్యా నిర్మిస్తోన్న ‘తుషీల్’ యుద్ధ నౌక ఈ ఏడాది సెప్టెంబర్‌లో, ‘తమల్’ వార్ షిప్ జనవరిలో భారత్‌కు చేరుకుంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News March 18, 2026

ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

image

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 18, 2026

మరికొన్ని గంటల్లో విధ్వంసం.. ఇరాన్ హెచ్చరిక

image

మరికొన్ని గంటల్లో గల్ఫ్‌ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సమ్రెఫ్, ఖతర్‌లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యూఏఈలోని అల్-హసన్ గ్యాస్ ఫెసిలిటీలపై అటాక్ చేస్తామని శాటిలైట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ 3 దేశాల్లోని ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, ప్రజలు అక్కడి నుంచి వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.

News March 18, 2026

PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.