News January 4, 2026
నయా ట్రెండ్.. పెద్ద టైటిళ్లు అయితేనేం!

టాలీవుడ్‌లో పెద్ద టైటిళ్ల హవా కన్పిస్తోంది. క్యాచీగా ఉంటే చాలూ సినిమా పేరు పెద్దదైనా పర్లేదంటున్నారు మేకర్లు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ కోవలోవే. అందులోనూ అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. అటు వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్(ఆదర్శ కుటుంబం హౌస్ నం.47) కూడా లెంగ్తీదే కావడం విశేషం.
Similar News
News February 17, 2026
మ.1.30 గం. వరకే స్కూళ్లు

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
News February 17, 2026
ఏఐ సమ్మిట్ గందరగోళంపై కేంద్రమంత్రి క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో <<19163370>>తొలిరోజు<<>> నెలకొన్న గందరగోళంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని.. సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇది AIపై ప్రపంచంలోనే జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ అని పేర్కొన్నారు. సదస్సుకు విశేష స్పందన వస్తోందని.. ఈరోజు 70వేల మందికిపైగా సదస్సుకు హాజరయ్యారని వెల్లడించారు.
News February 17, 2026
కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

TG: కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాన్ని BJP మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్‌గా షాహిన్ సుల్తానా(INC), వైస్ ఛైర్ పర్సన్‌గా లావణ్య(BJP) ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి యూనస్, వైస్ ఛైర్మన్‌గా శిరీష ఎన్నికయ్యారు. మరోవైపు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసింది.


