News January 4, 2026
NLG: 102లో డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 102-అమ్మఒడి సేవలలో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈనెల 5న (సోమవారం) ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఈఎమ్ఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ప్రతినిధులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎల్ఎమ్వీ (LMV) లైసెన్స్, బ్యాడ్జ్ కలిగి ఉండి, 23-35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో స్థానిక 108 కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.
Similar News
News April 20, 2026
NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.