News April 25, 2024
క్రికెట్ దేవుడికి హ్యాపీ బర్త్ డే

క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి సచిన్. 3 దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతో క్రీడాభిమానులను అలరించారు. ఏ దేశమైనా, ఎలాంటి పిచ్ అయినా, బౌలర్ ఎంత ఉద్ధండుడైనా మాస్టర్ క్లాసిక్ ఆటకు తలొంచాల్సిందే అన్న రీతిలో హవా కొనసాగించారు. క్రికెట్ గ్రౌండే దేవాలయం, సచినే దేవుడు అన్నట్లుగా మెప్పు పొందారు. ఎన్నో రికార్డులను సృష్టించి భావి క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. నేడు సచిన్ 51వ బర్త్ డే.
Similar News
News February 3, 2026
మున్సి‘పోల్స్’: ప్రచార బరిలోకి ముఖ్యనేతలు

TG: పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సి‘పోల్స్’ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. CM రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. FEB 9 వరకు CM రోజుకో సభలో ప్రచారం చేస్తారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా BRS కదులుతోంది. KTR, హరీశ్ రావు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనునున్నారు. అటు BJP తమకు పట్టున్న ఉత్తర TGపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ నాయకులు, MP, MLAలను రంగంలోకి దించుతోంది.
News February 3, 2026
హెయిర్ గ్రోత్‌కి గుడ్డు పెంకుల మాస్క్

కోడిగుడ్డు పెంకులను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. కోడి పెంకులను మెత్తటి పొడిలా చేసి కొబ్బరి నూనెలో కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. వారానికోసారి ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. ఆలివ్ నూనెలో ఒక స్పూన్ పెంకుల పొడి కలిపి తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చెయ్యాలి. గుడ్డు పెంకులోని పోషకాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయి.
News February 3, 2026
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


