News January 4, 2026

పల్నాడులో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

image

వరుస పండుగల నేపథ్యంలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. నరసరావుపేటలో ఆదివారం లైవ్ కోడి కేజీ రూ. 153 ఉంది. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, పెద్ద చెరువు, సత్తెనపల్లి రోడ్డు, తదితర ప్రాంతాల్లో చికెన్ స్కిన్ లెస్ కేజీ 260 నుంచి రూ. 280 విక్రయిస్తునారు. స్కిన్‌తో కేజీ రూ. 240 నుంచి రూ. 260 ఉంది. మటన్ కేజీ ధర రూ. 900 నుంచి రూ. వెయ్యి అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 640 నాన్ వెజ్ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News January 17, 2026

ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

image

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 17, 2026

అమరావతి రైతులకు ఒకేచోట ప్లాట్లు!

image

AP: అమరావతి రైతులకు వేర్వేరు చోట్ల ప్లాట్లు ఇవ్వడంతో వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. చాలా ఖర్చుతో కూడుకుని వారికి అప్పగించడం ఆలస్యమైంది. దీంతో 2వ విడత 20,494 ఎకరాలు సేకరిస్తున్న ప్రాంతంలో రైతులకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల CRDAకి అందే స్థలమూ ఒకే ప్రాంతంలో ఉండి సంస్థలకు కేటాయింపులో మధ్యలో అడ్డంకులు ఉండవని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

News January 17, 2026

మరోసారి ముంబైని చిత్తు చేసిన యూపీ

image

WPL-2026: ముంబైపై మరోసారి యూపీ వారియర్స్ సత్తా చాటింది. ఇవాళ 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత యూపీ 187/8 రన్స్ చేయగా.. ముంబై 165 పరుగులకే పరిమితమైంది. యూపీ కెప్టెన్ లానింగ్ 45 బంతుల్లో 70 రన్స్‌తో రాణించారు. కాగా జనవరి 15న కూడా ముంబైపై యూపీ గెలిచిన సంగతి తెలిసిందే.