News January 4, 2026
నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ప్రిన్సిపల్స్, పీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్స్ జిరాక్స్ అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు, డెమాన్ స్ట్రేషన్ తరగతులు ఈనెల 7న ఉదయం 10 గంటలకు దర్గామిట్ట ZP బాలికల హైస్కూలులో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
గణతంత్ర వేడుకల షెడ్యూల్ వివరాలు విడుదల

సోమవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించి కార్యక్రమం వివరాలు I&PR కార్యాలయం విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల జెండా ఆవిష్కరణ చేయనున్నారు. కలెక్టర్ సందేశం, శకటాల ప్రదర్శన, విద్యార్థిని, విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత జాతీయ గీతాలాపనతో ముగుస్తుందన్నారు.
News January 25, 2026
నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీస్ హై అలర్ట్: ఎస్పీ

గణతంత్ర దినోత్సవం, రథసప్తమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు.
News January 25, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

వరికుంటపాడు(M) తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాదం నెలకొంది. కందిచేనుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని బోణిగాలరావుపాడులో కందిచేను చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ST కాలనీకి చెందిన ఇద్దరు బైకు మీద వెళుతూ.. వాటికి తగిలారు. దీంతో బైకు దగ్ధమవ్వగా ఇద్దరూ చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


