News April 25, 2024

నేటితో సీఎం జగన్ బస్సు యాత్ర ముగింపు

image

AP: సీఎం జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేడు ముగియనుంది. టెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో ‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో యాత్ర మొదలైంది. ఇటు పులివెందులలో ఈ నెల 25న జగన్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 23, 2026

ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

image

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.

News January 23, 2026

Plz.. ఆ రీల్‌కు పిల్లల్ని దూరంగా ఉంచండి: అనిల్ రావిపూడి

image

తన డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పాపులర్ డైలాగ్స్‌లో ‘మద్యపానం మహదానందం’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఇన్‌స్టాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోందని, ఇన్‌స్టాలో వెరైటీగా రీల్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే పిల్లలకు మాత్రం దీన్ని చూపించొద్దని, వారిచే దానిపై రీల్ చేయించొద్దని కోరారు.

News January 23, 2026

Paytm షేర్ విలువ 10% డౌన్.. కారణమిదే

image

Paytm మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్’ షేర్లు ఒక్కరోజే 10% పడిపోయి ₹1,134కు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్’ (PIDF) పథకం 2025 డిసెంబర్ తర్వాత కొనసాగుతుందో లేదో అన్న ఆందోళనే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Paytm లాభాల్లో ఈ పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలే 20% వరకు ఉంటాయని అంచనా. దీనిపై RBI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.