News April 25, 2024
దేశానికే ఆదర్శం మన పాలమూరు: రేవంత్ రెడ్డి

BRS హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిజినేపల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘దేశానికే ఆదర్శవంతమైన నేతలను ఇచ్చిన గడ్డ మన పాలమూరు. 70ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కింది. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే KCR పాలమూరు MPగా పోటీ చేశారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే RS ప్రవీణ్ కాంగ్రెస్‌లోకి వస్తే ప్రభుత్వం డీజీపీగా నియమించేది’ అని అన్నారు.
Similar News
News March 19, 2026
MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.
News March 19, 2026
MBNR: ఉగాది సుఖ సంతోషాలు నింపాలి: SP

తెలుగు నూతన సంవత్సర ఉగాది(పరాభవ నామ సంవత్సర) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జానకి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో మొదలయ్యే ఈ తెలుగు నూతన సంవత్సరం, ప్రజలందరి జీవితాలలో శాంతి, సుఖ సంతోషాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, పోలీస్ సిబ్బంది, మీడియా, జిల్లా ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
News March 18, 2026
మహబూబ్‌నగర్: ‘వేసవిలో నీటి సమస్య తలెత్తకూడదు’

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి రాకుండా చూడాలని మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మూడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 60 డివిజన్లలో ఎప్పటికప్పుడు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


