News January 4, 2026
డిప్రెషన్ లక్షణాలివే..

డిప్రెషన్ ఉంటే ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంటారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. మూడీగా కనిపిస్తారు. అలాగే ఏదో తప్పు చేశామన్న భావన వారిలో ఉంటుంది. దీని వల్ల వారు ఇతరులతో సరిగ్గా మాట్లాడరు. సడెన్‌గా బరువు తగ్గడం/ పెరగడం జరుగుతుంది. కొందరికి విపరీతమైన ఆకలి, కొందరికి తిండి అంటే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తీవ్రమైన అలసట, నీరసం కూడా ఉంటాయి.
Similar News
News January 29, 2026
ఇండియన్ నేవీలో 260 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News January 29, 2026
‘పంచాంగం’లో ఏం ఉంటాయో మీకు తెలుసా?

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల సమాహారమే పంచాంగం. మన తెలుగువారు చంద్రుడి గమనాన్ని బట్టి రూపొందించిన చాంద్రమాన పంచాంగాన్ని అనుసరిస్తారు. తిథి సంపదను, వారం ఆయుష్షును, నక్షత్రం పాపహరణాన్ని, యోగం రోగనివారణను, కరణం కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. శుభకార్యాలకు ముహూర్తాలు చూసుకోవడానికి, వర్జ్యం, అమృతఘడియలను తెలుసుకోవడానికి పంచాంగం ఎంతో అవసరం. ఇది మన దైనందిన జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపిస్తుంది.
News January 29, 2026
విమాన ప్రమాదం.. రామ్మోహన్‌కు MH CM లేఖ

అజిత్ పవార్ వెళ్తున్న <<18980548>>విమానం ప్రమాదానికి<<>> గురికావడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి MH CM ఫడణవీస్ లేఖ రాశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంపై AAIB దర్యాప్తు ప్రారంభించిందని రామ్మోహన్ బదులిచ్చారు. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


