News January 4, 2026
9న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9న నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:30కు హెలికాప్టర్ ద్వారా పిఠాపురం చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, మధ్యాహ్నం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాకినాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:30కు తిరిగి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 21, 2026
వరంగల్: 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై WGL పోలీసులు నిఘా పెంచారు. కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 100 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పరిధిలో అత్యధికంగా 35 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్ 19, వెస్ట్ జోన్‌లో 31, ఈస్ట్ జోన్‌లో 15 కేసులు నమోదయ్యాయని, మద్యం తాగి వాహనం నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు.
News January 21, 2026
కొత్తగూడెం: తొలి రోజే పులి పాదముద్రలు లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్-2026’ సర్వే ప్రారంభమైంది. పాల్వంచ రేంజ్ పరిధిలో స్వయంగా DFO కిష్టాగౌడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో తొలిరోజే పులి పాదముద్రలు కనిపించాయి. ప్రతిరోజూ 5 కి.మీ మేర అటవీ ప్రాంతంలో జంతువుల కదలికలు, అడుగు జాడలను పరిశీలించి ‘M-STriPES’ యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. నాలుగేళ్లకు ఒకసారి ఈ వన్యప్రాణుల గణన జరుగుతుంది.
News January 21, 2026
ఐనవోలు: వృద్ధురాలి అనుమానాస్పద మృతి

HNK జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో కత్తుల ఐలమ్మ (60) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఐలమ్మ మనుమడు కత్తుల బన్నీ, ఐలమ్మ కొడుకు కత్తుల కొమురయ్య ఇద్దరూ గొడవ పెట్టుకుని దాడులు చేసుకుంటుండగా మధ్యలో వెళ్లిన ఐలమ్మకు ఇటుక రాయి ఛాతీ భాగంలో తాకడంతో గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. యువకుడు మత్తులో ఉన్నట్లు సమాచారం.


