News January 4, 2026
ఖమ్మం: ఏడాది గడిచినా అందని ‘ధాన్యం బోనస్’

ఖమ్మం జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత యాసంగిలో క్వింటాకు రూ. 500 చొప్పున ప్రకటించిన బోనస్ ఇంతవరకు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News January 30, 2026
ఖమ్మం: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

ఖమ్మం జిల్లాలో 2వ రోజు 309 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతలహామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.
News January 30, 2026
ప్రతి బిడ్డ చదువుకోవాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
News January 30, 2026
ఖమ్మం: 5 మునిసిపాలిటీలు.. 316 నామినేషన్లు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిన్నటివరకు 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎదులాపురం 87, వైరా 62, సత్తుపల్లి 62, కల్లూరు 76, మధిరలో 29 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలవారీగా మొత్తం 309 మందికి గానూ BJP 35, CPM 23, కాంగ్రెస్ 114, BRS 124, TDP 2, గుర్తింపున్న పార్టీలు 8, 10 మంది ఇండిపెండంట్లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నేడు నామినేషన్లకు అఖరిరోజు కావడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశముంది.


