News January 4, 2026
జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో 4.50 కోట్ల భక్తులకు ఏర్పాట్లు

జగిత్యాల జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ఉన్న గ్రామాల్లో అవసరమైన చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కర స్నానాలకు అనువుగా ఉన్న గోదావరి తీర ప్రాంతాలైన ధర్మపురి, కోటిలింగాలలో భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. 2015 పుష్కరాలకు 1.50 కోట్ల మంది భక్తులు రాగా, 2027లో జరిగే పుష్కరాలకు సుమారు 4.50 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేశారు.
Similar News
News January 14, 2026
ASF: మున్సిపల్ ఎన్నికల నగారా.. గెలుపు గుర్రాల వేట

ఆసిఫాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీలు సైతం పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి.
News January 14, 2026
కోడి పందేల హోరు: గెలిస్తే బుల్లెట్, కారు బహుమతి!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలు రసవత్తరంగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. 6 పందేలు వరుసగా గెలిచిన పుంజుల యజమానులకు బుల్లెట్ బైకులు, కొన్ని చోట్ల ఏకంగా లగ్జరీ కార్లను బహుమతులుగా అందజేస్తున్నారు. దీంతో బరుల వద్ద సందడి నెలకొంది. చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ రూ.కోట్లాది బెట్టింగ్‌లు, ఖరీదైన ఆఫర్లతో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి.
News January 14, 2026
HYDద్‌లో ‘ఫిన్లాండ్’ చదువుల జోరు

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ‘హారిజన్ ఎక్స్‌పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్‌లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


