News April 25, 2024

HYD: 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,32,858 మంది, ద్వితీయ సంవత్సరం 2,10,629 మంది పరీక్షలు రాశారు. మొత్తం 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

Similar News

News September 12, 2025

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

image

కూకట్‌పల్లిలోని 15వ ఫేజ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార కేంద్రాన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 12, 2025

కూకట్‌పల్లిలో రేపు జాబ్ మేళా

image

ఐటీ, డీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి కిషన్ తెలిపారు. కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలో ఈ మేళా ఉంటుందన్నారు. ఇంటర్ మీడియట్‌లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్లు తమ వెంట కచ్చితంగా తీసుకురావాలన్నారు. వివరాలకు 76740 07616, 79818 34205 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 12, 2025

HYDలో 19 యూపీఎస్సీ పరీక్ష కేంద్రాలు

image

HYDలో ఈనెల 14న యూపీఎస్సీ పరీక్షలు 19 కేంద్రాల్లో జరుగనున్నాయి. కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్-2, నేవల్ అకాడమి నేషనల్ డిఫెన్స్ అకాడమి-2 పరీక్షలు, నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు 7688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలని హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి సూచించారు.