News January 4, 2026
VKB: 630 కుక్కలకు స్టెరిలైజేషన్: ఏసుదాస్

పట్టణంలో 630 వీధి కుక్కలను పట్టి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఆహారం అందిస్తున్నామని వికారాబాద్ మునిసిపల్ ఇన్‌ఛార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని జనన నియంత్రణ కేంద్రంలో ఆపరేషన్లు చేసిన కుక్కలకు ఆహారం అందించారు. కుక్కలను నియంత్రించేలా వాటి సంఖ్యను పెరగకుండా ఆపరేషన్లు చేసి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించి వదిలిపెడతామని తెలిపారు.
Similar News
News February 28, 2026
వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.
News February 28, 2026
నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.
News February 28, 2026
సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ ఎగ్జామ్‌కు 365 మంది గైర్హాజరు

ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. 18,465 మంది విద్యార్థులకు గాను 18,098 మంది విద్యార్థులు హాజరయ్యారు. 367 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


