News January 4, 2026
సత్య సాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ks షాన్వాజ్

కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ks షాన్వాజ్‌ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 13, 2026
విశాఖ: ఆ ప్యాసింజర్ గంటన్నర ఆలస్యం

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ -భవానిపట్నం ట్రైన్ నెంబర్ (58504) పాసింజర్ రైలు సమయం మార్పు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ 1:30 పాటు ఆలస్యంగా 7:30 గంటలకు బయలుదేరుతుందని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవలసిందిగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ట్రైన్ విజయనగరం, బొబ్బిలి , రాయగడ మీదుగా భవానిపట్నం చేరుతుంది.
News January 13, 2026
త్వరలో చిరంజీవితో సినిమా చేస్తా: మారుతి

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ‘రాజాసాబ్’ డైరెక్టర్ మారుతి చెప్పారు. ‘‘రాజాసాబ్’ మూవీకి 3 ఏళ్ల కష్టం 3 గంటలు తీసి చూపిస్తే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. త్వరలో వాళ్లే రియలైజ్ అవుతారు. నేనేమీ వారిని శపించట్లేదు. వారిపట్ల బాధపడుతున్నా. రాజాసాబ్ రెండోసారి చూస్తే రైటింగ్‌లో లోతు తెలుసుకుంటారు. అర్థం చేసుకోవాలంటే మరోసారి చూడండి’’ అని మీడియా చిట్ చాట్‌లో అన్నారు.
News January 13, 2026
జగిత్యాల: జిల్లా ప్రజలకు భోగి–సంక్రాంతి–కనుమ శుభాకాంక్షలు

జగిత్యాల జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే పండుగగా సంక్రాంతి ప్రత్యేకతను వివరించారు. పండుగలను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.


