News January 4, 2026
మారథాన్‌లో అదరగొడుతున్న ములుగు యువకుడు

ములుగు జిల్లా రాయినిగూడెంకి చెందిన వజ్జ నిఖిల్ కుమార్ మారథాన్ రన్‌లో దూసుకుపోతున్నాడు. ఈరోజు చెన్నైలో జరిగిన మారథాన్‌లో 32.186 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి జనవరి 18న జరిగే ముంబాయి మారథాన్ 42 కిలోమీటర్ల పరుగుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్లను కూడా పూర్తి చేశారు. నిఖిల్ కుమార్‌ను పలువురు అభినందించారు.
Similar News
News February 16, 2026
హోరాహోరీ పోరులో పాలమూరు విజయం

జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 టోర్నీ ఫైనల్‌లో మహబూబ్ నగర్ జట్టు 15 ఓవర్లలో 110/5 పరుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 పరుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఖమ్మం జట్టు 107/5 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 పరుగులు చేశారు. ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జ్యోతి హాజరయ్యారు.
News February 16, 2026
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మెచ్చుకున్నారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు గేట్స్‌కు సీఎం వివరించారు.
News February 16, 2026
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.


