News January 4, 2026
పసి ప్రాణం తీసిన దుప్పటి.. తల్లి ప్రేమకు మిగిలింది కన్నీళ్లే!

వారణాసి (UP)లో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. రాహుల్ కుమార్, సుధా దేవి దంపతులకు 25 రోజుల క్రితం పుట్టిన పసికందు చలి తీవ్రతకు బలైంది. గడ్డకట్టే చలి నుంచి కాపాడాలని తనతో పాటు బిడ్డకూ మందమైన దుప్పటి కప్పి పడుకున్నారు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పెళ్లైన 2ఏళ్లకు పుట్టిన తొలి బిడ్డ కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News February 22, 2026
సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News February 22, 2026
తడి బట్టలతో పూజ చేయవచ్చా?

దైవకార్యాల్లో తడి బట్టలు ధరించకూడదు. అలా చేస్తే పితృదేవతలు ఆగ్రహానికి గురవుతారని నమ్మకం. ‘తడి బట్టల నుంచి కారే నీరు పితరులకు వెళ్తుందని, తద్వారా వారు అసంతృప్తి చెందితే సంతాన, సంపద లోపం కలుగుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది. తడి బట్టలతో ఆలయ ప్రవేశం, పూజ చేయడం మహా పాపం. అపర కార్యాలకు మాత్రమే తడి బట్టలు నిషిద్ధం కాదు. కాబట్టి ఎప్పుడూ పొడి బట్టలతోనే పూజలు నిర్వహించాలి’ అని పండితులు చెబుతున్నారు.
News February 22, 2026
ఉగ్రకుట్రకు ప్లాన్?.. ఎనిమిది మంది అరెస్ట్

మరోసారి ఉగ్రదాడి జరగొచ్చన్న సమాచారంతో <<19199047>>ఢిల్లీ పోలీసులు<<>> అలర్ట్ అయ్యారు. తమిళనాడులో ఆరుగురు, ప.బెంగాల్‌లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ISI, బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మద్దతుతో వీరు ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ 8 మందిలో బంగ్లాకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. వారి నుంచి ఫోన్లు, సిమ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


