News January 4, 2026

MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

image

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 17, 2026

జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 17, 2026

పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

image

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి  తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT

News February 17, 2026

MBNR: మేయర్, డిప్యూటీ మేయర్ వేతనాలు ఎంతో తెలుసా..!

image

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ముగిశాయి. ఎంతోమంది ఎన్నో ఎన్నో లక్షల ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీపడి కార్పొరేటర్‌గా గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా గట్టి పోటీ ఉంటుంది. మేయర్ నెలసరి వేతనం రూ.65 వేలు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేయర్‌కు రూ.32,500, అలాగే కార్పొరేటర్‌కు రూ.7,800 వేతనాలు ఉంటాయి.