News January 4, 2026

మేడారం జాతర.. టోల్ ‘ఫ్రీ’ పరిశీలిస్తున్నామన్న కోమటిరెడ్డి

image

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News February 11, 2026

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

image

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 FYకి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.

News February 11, 2026

ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

image

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.

News February 11, 2026

శివుడు లేని చోటు గలదా?

image

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.