News April 25, 2024
REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు
Similar News
News April 22, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤పత్తికొండ యువతికి 990 మార్కులు➤ విషాదం.. తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ➤ రేపే పదో తరగతి రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు➤ కర్నూలు: ఆర్టీసీ బస్సులో పొగలు ➤ కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు➤ కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరికలు➤ ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు➤ గూడూరులో ఇద్దరు కార్మికుల మృతి➤ డిప్యూటీ డీఈవోగా ఐజీ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు
News April 22, 2025
పత్తికొండ యువతికి 990 మార్కులు

పత్తికొండ పట్టణంలోని అరుంధతి నగర్‌కు చెందిన వడ్డే రాజగోపాల్, అనిత దంపతుల కుమార్తె నేహ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో చదివిన యువతి బైపీసీలో 990/1000 మార్కులు సాధించారు. దీంతో అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు యువతిని అభినందించారు.
News April 22, 2025
తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.