News January 4, 2026

పోలీస్ అతిథి గృహానికి సంబంధం లేదు: పోలీసు శాఖ

image

తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమైన ప్రదేశం పోలీస్ అతిథి గృహానికి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ శాఖ తెలిపింది. బాలాజీకాలనీ సమీపంలోని పిట్టగోడ వెనుక చెట్లు పొదళ్లో ఉన్నాయి. ఆ ప్రదేశానికి పోలీస్ అతిథి గృహం 25 నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంది. అది సాధారణ కార్ పార్కింగ్ అని పోలీసులు వెల్లడించారు. మరో వైపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని టీటీడీ కూడా స్పందించింది.

Similar News

News February 19, 2026

సిద్దిపేట: రాష్ట్రస్థాయి దివ్యంగుల క్రీడల్లో జిల్లా క్రీడాకారుల సత్తా

image

హైదరాబాద్ దోమలగూడలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యంగుల క్రీడా పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 11 బహుమతులు గెలుచుకున్నారు. అండర్-14, 17 విభాగాల్లో వినికిడి, దృష్టి లోపం మరియు ఇతర దివ్యాంగ విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యంతో జిల్లా కీర్తిని చాటారు.

News February 19, 2026

‘ఇంజినీర్’ అంటూ బంగ్లాదేశ్ PMపై ట్రోల్స్.. కారణమిదే!

image

బంగ్లాదేశ్ కొత్త PM తారిఖ్ రెహ్మాన్‌‌ను ఇంజినీర్ అంటూ ప్రతిపక్ష నేతలు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల <<19125261>>ఫలితాలను<<>> తనకు అనుకూలంగా ఇంజినీరింగ్(మార్చుకున్నారని) చేశారని విమర్శిస్తున్నారు. ‘విద్యార్హతలు లేకుండానే ఇంజినీర్ అయ్యాడు’, ‘ది మ్యాన్, మిత్, లెజెండ్, ఇంజినీర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. రెహ్మాన్‌‌ హయ్యర్ సెకండరీ(12వ తరగతి) వరకే చదువుకోవడం గమనార్హం. 17 ఏళ్లు లండన్‌లో ప్రవాసంలో ఉన్నారు.

News February 19, 2026

GK: ఫిబ్రవరిలో ముఖ్య రోజులు

image

feb 4: ప్రపంచ క్యాన్సర్ దినం
feb 10: ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం
feb 11: అంతర్జాతీయ బాలిక, మహిళల విజ్ఞాన దినోత్సవం
feb 13: ప్రపంచ రేడియో దినోత్సవం
feb 20: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
feb 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
– ప్రతిరోజూ 2amకు జనరల్ నాలెడ్జ్ కంటెంట్ పొందండి