News January 4, 2026

కామారెడ్డి: సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు రివార్డులు

image

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలనిస్తోంది. తీవ్ర చలిలోనూ అప్రమత్తంగా వ్యవహరించి గంజాయి రవాణాను అడ్డుకున్న ఏఎస్ఐ నరసయ్య, సిబ్బంది సుబ్బారెడ్డి, రెడ్డి నాయక్, సంతోష్, బలరాం, భూపతిలను SP రాజేష్ చంద్ర అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందజేశారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని SP విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 30, 2026

చర్చలకు మాస్కో రండి.. జెలెన్‌స్కీకి రష్యా ఆహ్వానం

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్‌స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.

News January 30, 2026

మున్సిపల్ ఎన్నికల కన్వీనర్‌గా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

image

వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్‌గా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నియమితులయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో ఎన్నికల వ్యూహరచన, సమన్వయం, ప్రచార పర్యవేక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ఆయనకు అప్పగించింది. ఇనగాల నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News January 30, 2026

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: రేపు స్కూళ్లకు సెలవు
> రఘునాథపల్లి: చికిత్స పొందుతూ యువకుడి మృతి
> మినీ మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతాం: కడియం
> రంజాన్ మాసం ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
> జనగామ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు
> మేడారం జాతరపై కేజీబీవీలో మాక్ అసెంబ్లీ
> బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే