News January 4, 2026
త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడతా: చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీలో TG సీఎం రేవంత్ వ్యాఖ్యలపై AP సీఎం చంద్రబాబు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన ఆయన కృష్ణా జలాలపై త్వరలోనే మాట్లాడతానని తెలిపారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తానని అన్నారు.
Similar News
News February 22, 2026
పండుగ రోజుల్లో ముహూర్తాలు ఎందుకు ఉండవు?

ముహూర్త శాస్త్రం ప్రకారం.. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలం. శ్రీరామనవమి, దుర్గాష్టమి, వినాయక చవితి పండుగ తిథులు అశుభ తిథుల కోవలోకి వస్తాయి. లోక కళ్యాణం కోసం దైవం ఆ రోజుల్లో అవతరించినా, సామాన్యుల వ్యక్తిగత కార్యాలకు (వివాహం, గృహప్రవేశం) ఆ తిథి బలం సరిపోదు. అందుకే పండుగ పవిత్రమైనా, శాస్త్రం నిర్దేశించిన తిథి శుద్ధి లేని కారణంగా ముహూర్తాలు నిర్ణయించరు.
News February 22, 2026
IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు దరఖాస్తు గడువును పెంచింది. అప్లైకి ఫిబ్రవరి 23 ఆఖరు తేదీ కాగా.. మార్చి 4వరకు పొడిగించారు. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in
News February 22, 2026
కిచెన్ బడ్జెట్‌పై భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

GST తగ్గించినా నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరగనున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, హెయిర్ ఆయిల్, నూడుల్స్ వంటి వస్తువుల రేట్లను 5% వరకు పెంచేందుకు FMCG కంపెనీలు సిద్ధమయ్యాయి. కొబ్బరి నూనె, ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే HUL, టాటా కన్జూమర్, డాబర్ వంటి సంస్థలు ధరల పెంపును ధ్రువీకరించాయి. పెరిగిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉంది.


